Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు మద్దతిచ్చిన నవనీత్ కౌర్.. ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా?

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (16:58 IST)
మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్ రాణా ఏపీ మంత్రి రోజాకు మద్దతిచ్చారు. ఏపీ మంత్రి రోజాపై దారుణ వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తాను మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు. ఓ తెలుగు అమ్మాయి రోజా గురించి మీరు ఇలా మాట్లాడటానికి సిగ్గులేదా? అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకోండి అంటూ బండారుపై మండిపడ్డారు.
 
రోజాకు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచే కాదని, దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. అందరూ రోజా వెనుకే ఉంటారన్నారు. ఓ రాజకీయ నాయకురాలిగా,  ఓ మహిళగా, ఒక ఫైటర్‌గా తామంతా రోజా వెంటే ఉంటామన్నారు. 
 
తనకు ఏ పార్టీ వ్యక్తి అనేది సంబంధం లేదన్నారు. రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారని, సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా చేశారని, ఆమె పెద్దపెద్ద హీరోలతోను నటించారన్నారు.
 
ఒకవేళ రోజాకు సంబంధించి మీ వద్ద ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలన్నారు. రాజకీయాలు అవసరమా లేకుంటే ఆంధ్రా, తెలంగాణలలోని మహిళల గౌరవం కావాలా? అని ప్రశ్నించారు. 
 
తాను లోక్ సభలో కూర్చున్నప్పుడు అందరూ తనకు మంచి గౌరవం ఇస్తారన్నారు. అలాంటిది రోజా గురించి అలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments