Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెదేపా నాయకుడు బండారు మాటలు: కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా- video

Roja
, మంగళవారం, 3 అక్టోబరు 2023 (23:06 IST)
తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం రాత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ... మీ ఇంటివాళ్లే ఆడవాళ్లా, వైసీపికి చెందినవాళ్లు ఆడవాళ్లు కాదా అని ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చూసిన వెంటనే ఆయన భార్య తన భర్త చెంప ఛెళ్లుమనిపించినట్లయితే మరోసారి స్త్రీలను ఇంత చులకనగా మాట్లాడేందుకు భయపడేవాడని అన్నారు.
 
తనను నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడంపై రోజా తీవ్ర ఆవేదనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. 1999లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ఎంతో కష్టపడ్డానన్నారు. ఆ తర్వాత రాజకీయంగా ఆ పార్టీ నచ్చక వైసిపిలో చేరినట్లు చెప్పారు. వైసిపిలో చేరిన దగ్గర్నుంచి తనపై తెదేపా నాయకులు కక్ష పెంచుకుని అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్వేగానికి లోనయ్యారు.
 
బండారు సత్యనారాయణ తనపై చేసిన అసభ్యపదజాలాన్ని తను చెప్పలేనని ల్యాప్ టాప్ ఆన్ చేసి వినిపించారు. ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10వ సీజన్ ‘బనేగా స్వస్త్ ఇండియా’ ఆవిష్కరణ సంబరాలు: ప్రచారానికి అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా