Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చేతిని నరికిన కసాయి.. పెళ్లైన రెండు నెలలకే ఘాతుకం..!

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (13:32 IST)
ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా కసాయిలా చేతిని నరికాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. అనుమానం పెనుభూతమై పెళ్లైన రెండు నెలలకే భార్య చేతులు నరకడంతో బాధితురాలిని భోపాల్‌లోని హమిదియ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఆమె చేతులను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
 
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రణ్‌ధీర్‌ సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో రణ్‌ధీర్‌ గొడ్డలితో తన భార్య చేతులను నరికి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని నిందితుడు కేవలం రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
పెళైన పదిహేను రోజులకే భర్త తనను అనుమానంతో వేధించేవాడని, ఎవరితో మాట్లాడినా అభ్యంతరం తెలిపేవాడని బాధితురాలు పేర్కొన్నారు. మరోవైపు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలికి ఆమె మామ సంరక్షకులుగా ఉన్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

శ్రీకాకుళం శ్రీ ముఖలింగం ప్రత్యేకత తెలిపే శివ శక్తి పాట కాశీలో లాంచ్ కాబోతోంది

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments