Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానా పాత్ర‌కు స్పూర్తి ఎవ‌రో తెలుసా!

రానా పాత్ర‌కు స్పూర్తి ఎవ‌రో తెలుసా!
, సోమవారం, 22 మార్చి 2021 (14:12 IST)
Tomatos, Rana
రానా ద‌గ్గుబాటి న‌టించిన నూత‌న చిత్రం `అర‌ణ్య‌`. ఈ సినిమాలో రానా అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించే స్నేహితుడు (మావ‌టివాడు)గా న‌టించాడు. జంతువుల బాష తెలిసి వాటితో మ‌మేకం అయ్యే పాత్ర అది. దానికోసం రానా చాలా క‌ష్ట‌ప‌డ్డాడుకూడా. అయితే ఇందులో ఆయ‌న పాత్ర ఆహార్యంలోనూ మేన‌రిజంలోనూ ఒక ప్ర‌త్యేక‌త దాగివుంది. రానా పొడ‌గ‌రి. క‌నుక పాత్ర‌ప‌రంగా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌. అందుకోసం రానాకు త‌ర్పీదు కూడా ఇచ్చాడు. పూర్తిగా పెరిగిన గ‌డ్డం, మీసాలు, చేతిలో పొడ‌వాటి క‌ర్ర‌లాంటి ఆయుధం. న‌డిచేట‌ప్పుడు గూని వున్న‌ట్లుగా వంక‌ర‌గా న‌డ‌వ‌డం వంటి మేన‌రిజాలు కేవ‌లం రానాను చూడ‌గానే ద‌ర్శ‌కుని అనిపించాయ‌ట‌.

ఈ పాత్ర హాలీవుడ్ న‌టుడు రొటేన్ టొమ‌టోస్ స్పూర్తిగా తీసుకుని చేసిన‌ట్లు ప్ర‌భుసాల్మ‌న్ చెప్పాడు. `టెన్‌కమాండ్‌మెంట్స్‌` సినిమాలో టొమ‌టోస్ కేరెక్ట‌ర్‌ను చూసి రానాను మ‌లిచిన‌ట్లు చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు. ఆ పాత్ర‌ను చూడ‌గానే రానా కూడా ఎంతో ఆనంద‌ప‌డ్డాడ‌ట‌. బాహుబ‌లి త‌ర్వాత మ‌ర‌లా విభిన్న‌మైన పాత్ర చేయ‌లేద‌ని అన్నాడ‌ట రానా. అందుకే వెంట‌నే ఓకే చెప్పి. ఆ సినిమాను ప‌లుసార్లు చూసి త‌నకు అనుకూలంగా మార్చుకున్నాడట రానా. మ‌రి ఎప్పుడో 1956లో వ‌చ్చిన‌ టెన్‌క‌మాండ్‌మెంట్స్‌ను చూసి ఆ త‌ర‌హాలో పాత్ర డిజైన్ చేయ‌డ‌మే విశేష‌మేగ‌దా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గబ్బర్ సింగ్ భామకు కొత్త ప్రియుడు.. "వెస్టెడ్ పైనాపిలా.. రోస్టెడ్ పైనాపిలా"