Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగుల ఇంట్లో మ‌నుషుల అరాచ‌కం `అర‌ణ్య‌`.. అదిరిపోయింది-video

Advertiesment
ఏనుగుల ఇంట్లో మ‌నుషుల అరాచ‌కం `అర‌ణ్య‌`.. అదిరిపోయింది-video
, బుధవారం, 3 మార్చి 2021 (20:09 IST)
Aranya poster
రానా న‌టించిన చిత్రం `అర‌ణ్య‌`. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేనర్‌లో రూపొందింది. ఈ ట్రైల‌ర్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. రాజ‌కీయ అధికారంతో అట‌వీ మంత్రి, పోలీసు యంత్రాంగం ఎలా అడ‌విలో నివాసం వుండే ఏనుగుల‌ను అక్క‌డి మ‌నుషుల‌ను కాల్చుకుతిన్నార‌నేది క‌థ‌నం. ఏనుగుల అవసరాలు, మనుషుల దురాశకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ఓ మావటివాడిగా ఏనుగులను రక్షించే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ తెలుగు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ట్రైల‌ర్‌లో ఏముందంటే
‘ఏనుగులు మనకంటే ఎంతో తెలివైనవి. ఎంతో భావోద్వేగం కలవి..’ అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ఇందులో కొంతమంది తమ స్వార్థం కోసం ఏనుగులను బంధించిన తర్వాత ‘అయ్యో..! ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిందే’ అంటూ రానా అవేదనతో చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ త‌ర్వాత ఓ విలేక‌రి వ‌చ్చి రానాను కాప్ష‌న్‌కోసం ఏమి జ‌రిగింది అని అడుగుతుంది.
ఏనుగుల ఇంట్లో మ‌నుషుల అరాచ‌కం.. చాలా అంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు. తెలుగులో ‘అరణ్య’ పేరుతో వస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లోనూ అలరించనుంది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. చిత్రీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం కోసం ఆడిన వారి ప‌రిస్థితి చూసి షాక్ అయ్యాః సందీప్ కిషన్