నాలుగు నెలల చిన్నారికి సోకిన కరోనా.. కేరళలో మృతి

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:10 IST)
కరోనా ముక్కుపచ్చలారని పసి ప్రాణాలను తీసింది. తాజాగా నాలుగు నెలల చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. 
 
పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతున్న చిన్నారి శుక్రవారం ఉదయం మరణించింది. అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.
 
కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్‌ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments