Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

"లాక్‌డౌన్ బావి" - అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన కేరళ ఫ్యామిలీ

Advertiesment
Kerala
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (18:20 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశం యావత్తూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీనికితోడు లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కరూ రోడ్లపైకి రావడం లేదు. కూలీ పనులకు వెళ్లడం లేదు. కానీ, ఆ కుటుంబం మాత్రం దేశ ప్రజలకు ఆదర్శంగా నిలించింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదు. ఫలితంగా ఆ కుటుంబంలోని ఏకంగా 11 మంది సభ్యులు ఏకంగా 24 అడుగుల లోతు ఉండే బావిని తవ్వేశారు. ఏంటీ ఈ వార్త ఆశ్చర్యంగా ఉందా.. అయితే, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కేరళ రాష్ట్రంలోని కున్నూరు ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర రెడ్‌ జోన్‌గా ప్రకటించింది. పైగా, ఈ ప్రాంతంతో పాటు వీధివీధిని నిర్బంధించింది. అయితే, కన్నూరు సమీపంలోని పినరాయ్‌లో సనీస్, జోస్‌ జాన్సన్‌ అనే సోదరులు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అంటే ఈ కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు.
 
ఈ క్రమంలో లాక్‌డౌన్ కాలాన్ని ఎలా గడపాలో వారికి తోచలేదు. ఈ క్రమంలో తమ నివాసంలోని బోర్‌ నీళ్లు క్రమంగా తగ్గిపోతుండటాన్ని గమనించారు. దీనికి ఏదైనా మార్గం అన్వేషించాలనుకున్నారు. ఆ అన్వేషణలో భాగంగా వారికి ఓ ఆలోచన తట్టింది. 
 
ఆ ఆలోచనలో భాగంగానే, తమ ఇంటి వెనుక పెరటిలో ఓ చిన్న బావి తవ్వితే ఎలా ఉంటుందా? వారంతా చర్చించుకున్నారు. ఇంట్లో అందరూ కూర్చుని తల్లి, తండ్రి, మూడేళ్ల కుమారుడు మినహా మిగిలిన 8 మంది కలిసి ప్రతి రోజూ కొంచెం కొంచెంగా బావి తవ్వాలని నిర్ణయించారు. 
 
అలా, ఖాళీ సమయంలో బావి తవ్వటం మొదలుపెట్టారు. 11 రోజుల్లో 15 అడుగులు తవ్వారు. 12వ రోజు 16 అడుగులకు నీటి తడి కనిపించింది. 13వ రోజు 17 అడుగులకు నీరు పడటంతో ఆ ఉత్సాహంతో మరో రెండు రోజుల్లో 24 అడుగుల లోతు తవ్వేసి బావి చుట్టూ గుండ్రటి సిమెంట్ వరలు వేసి రోజూ ఆ నీటిని వినియోగిస్తున్నారు. కరోనా లాక్‌‌డౌన్‌ తమ నివాసానికి నీటి బావిని అందించిందని కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తంచేశారు. 
 
పైగా, తాము బావి తవ్వే క్రమాన్ని వారు వీడియోతో పాటు.. ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తమ స్నేహితుల వద్ద షేర్ చేసుకున్నారు. వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ "లాక్‌డౌన్ బావి" అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విముక్త రాష్ట్రంగా గోవా ... పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్‌లే...