Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని నాశనం చేస్తున్న జగన్.. ప్రభుత్వ టెర్రరిజం : మోహన్‌దాస్ పాయ్

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ పరిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందంటూ మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో పాయ్ ఓ బడాపారిశ్రామికవేత్తగా ఉన్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పీపీఏలపై సమీక్షలు నిర్వహించాలని, రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై మోహన్ దాస్ పాయ్ ఘాటైన వ్యాఖ్యలతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి, దాన్ని నేరుగా జగన్‌కు ట్యాగ్ చేశారు. 
 
ఏపీలో ప్రభుత్వం ట్రెరిరిజం కొనసాగుతోందని మండిపడ్డారు. పీపీఏల సమీక్ష రాష్ట్ర భవిష్య‌కు మంచిదికాదన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించారు. జపాన్ పరిశ్రమ కంపెనీలు లేఖలు రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా అంటూ ప్రశ్నించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని పలు కంపెనీల్లో ఆయన ఇండిపెండెంట్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఒక్క పరిశ్రమా రాదన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఏపీ భవిష్యత్‌ను నాశనం చేయవద్దని ఆయన హితవు పలికారు. ఇదే విషయంపై జగన్‌కు జూన్ నెలాఖరులో ఓ లేఖ రాశారు కూడా. 
 
ఈయన అక్షయపాత్ర సహ వ్యవస్థాపకులు కావడం గమనార్హం. ఇండస్ట్రీని దెబ్బతీసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ భవిష్యత్‌ను జగన్ నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments