Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం కేబినెట్ విస్తరణ! ముహూర్తం ఫిక్స్ చేసిన మోడీ!

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (12:40 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త మంత్రివర్గంలో 28 మందికి స్థానం కల్పించనున్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌గాంధీ తదితరుల పేర్లు జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి.

పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందుగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణ కావడంతో, ఈసారి కేబినెట్‌ కూర్పు భారీగానే ఉండొచ్చునని భావిస్తున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈనెల 30వ తేదీన ఢిల్లీ తిరిగివచ్చిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు.

2019లో మంత్రివర్గం ఏర్పా టు చేసిన తర్వాత ప్రధానమంత్రి విస్తరణకు పూనుకోవడం ఇదే మొదటి సారి. కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న రాంవిలాస్‌ పాశ్వాన్‌, సురేశ్‌ అంగడి మరణించారు. అనేక మంది మంత్రులు ప్రస్తుతం ఒకటికి మించి శాఖల్ని నిర్వహిస్తున్నారు. 
 
 
మోదీ కెప్టెన్సీలో వచ్చే ఎన్నికల్లో ఈసారి ఐదు రాష్ట్రాలనూ కైవసం చేసుకోవాలని కమలదళం ఆరాటపడుతోంది. కేబినెట్‌ కోసం ఈదిశగానే కసరత్తు జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాల అంచనాను బట్టి, ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. వీరిలో బీజేపీ యూపీ అధ్యక్షుడు, సంకీర్ణ దళం అప్నాదళ్‌ నేత పేర్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.
 
ఇక.. ఒడిసా, రాజస్థాన్‌ నుంచి ముగ్గురు చొప్పున, బెంగాల్‌, ఢిల్లీ నుంచి ఒకరు చొప్పున కేబినెట్‌లో చేరనున్నారు. బిహార్‌లో రాం విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు లోక్‌ జనశక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌పై తిరుగుబాటు చేసిన ఆయన బాబాయి పశుపతి పరా్‌సకు బెర్త్‌ ఖరారయింది.

ఇక్కడ సంకీర్ణ దళం జేడీయూ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి చాన్స్‌ ఇస్తున్నారు. ఇక.. కర్ణాటక, హరియానా, లద్ధాఖ్‌ (కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి ఒకరు చొప్పున, గుజరాత్‌ నుంచి ఇద్దరిని చేర్చుకొంటున్నారు. 
 
 
జాబితాలో...
కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే, భూపేందర్‌ యాదవ్‌, కైలాశ్‌ విజయవర్గీయ (ఈ ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శులు). మైనారిటీ నేత సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ, అప్నాదళ్‌ నేత అనుప్రియపాటిల్‌, మహారాజ్‌గంజ్‌ ఎంపీ పంకజ్‌ చౌధురి, రైల్వే మాజీ మంత్రి దినేశ్‌ త్రివేదీ, వైజయంతీ పాండా, అశ్వనీ వైష్ణవ్‌ (ఈ ఇద్దరు ఒడిసా ఎంపీలు), ఢిల్లీ ఎంపీ మీనాక్షీలేఖీ, రాజ్యసభ ఎంపీ అనీల్‌ జైన్‌,  సుమేధానంద సరస్వతి, పీపీ చౌధురి, రాహుల్‌ కాశ్వాన్‌ ( ఈ ముగ్గురు రాజస్థాన్‌ నేతలు), లోక్‌ జనశక్తి నేత పశుపతి పారస్‌, ఆర్‌సీపీ సింగ్‌, సంతోశ్‌ కుమార్‌ (ఈ ఇద్దరు జేడీయూ నేతలు), కర్ణాటక ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌, గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, అహ్మదాబాద్‌ వెస్ట్‌ ఎంపీ కిరీట్‌ సోలంకి,  పహ్యానా ఎంపీ సునీతా దుగ్గల్‌, లద్దాఖ్‌ ఎంపీ నంగ్యాల్‌ తదితరులు జాబితాలో ఉండొచ్చుని  సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments