Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధానికి అడ్డు.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది..!

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (12:12 IST)
వివాహేతర సంబంధానికి అడ్డొస్తానని అనుమానంతో భర్తను భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట పరిధిలో గల బోడియాతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడియాతండాకు చెందిన కున్‌సోతు రవి(35) బుధరావుపేట గ్రామానికి చెందిన దావూద్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే దావూద్‌కు రవి భార్య భారతికి ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం దావూద్‌ వద్ద రవి డ్రైవర్‌ పని మానేశాడు. అయినా భారతి ఇంటికి దావూద్ వెళ్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో రవిని హత్య చేయాలని అతని దావూద్, భారతి పథకం పన్నారు. ఏప్రిల్‌ 23న రవితో ఫుల్‌బాటిల్‌ మందు తెప్పించుకుని బుధరావుపేట గ్రామ శివారులోకి వెళ్లి మద్యం తాగాడు దావూద్. 
 
మద్యం మత్తులో ఉన్న రవిని కర్రతో దావూద్‌ బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేసి భారతికి విషయం తెలియజేసి ఇంటికి వెళ్లిపోయాడు.
 
మరుసటి రోజున మృతదేహం నీటిపై తేలియాడటాన్ని దావూద్‌కు గమనించి రెండు బండరాళ్లను కట్టి బావిలోకి వదలడంతో నీటిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా నుంచి కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఈరమ్మ ఈనెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments