Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటోలా?: ప్రియాంక గాంధీ

Advertiesment
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటోలా?: ప్రియాంక గాంధీ
, గురువారం, 27 మే 2021 (12:01 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ తన సొంత ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్రా విమర్శలు చేశారు.

వ్యాక్సినేషన్ అనేది ప్రజల ప్రాణాలను కాపాడే ఓ సాధనమని, దానిని ఆ కోణంలో చూడకుండా, ఆయన సొంత ఇమేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ఆమె దుయ్యబట్టారు.

దేశంలో వ్యాక్సిన్ కొరతకు మోదీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర దేశాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు.

వ్యాక్సిన్ విషయంపై ఓ వైపు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటోను పెట్టి, మొత్తం బాధ్యతను రాష్ట్రాల పై నెట్టివేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో తీవ్ర వడగాడ్పుల