Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ 3.0 మ్యాజిక్‌తో రాహుల్ గాంధీకి రూ.46.49 లక్షల లాభమా?

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:51 IST)
Rahul Gandhi
మోదీ 3.0 మ్యాజిక్‌తో భారత స్టాక్ మార్కెట్ల ఆశ్చర్యకరమైన వృద్ధిపై కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ తన స్టాక్ పెట్టుబడుల నుండి 46.49 లక్షల రూపాయల భారీ లాభాన్ని ఆర్జించారని డేటా తెలిపింది. 
 
అదీ కేవలం ఐదు నెలల్లోనే రాహుల్ గాంధీ రూ.46.49 లక్షల్ని స్టాక్ మార్కెట్‌ ద్వారా రాహుల్ గాంధీ ఆర్జించినట్లు తెలుస్తోంది. ఈ పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు రూ. 4.33 కోట్ల నుంచి (ఎన్నికల అఫిడవిట్ ద్వారా వెల్లడైన మార్చి 15, 2024 నాటికి) దాదాపు రూ. 4.80 కోట్లకు (ఆగస్టు 12, 2024 నాటికి) పెరిగిందని తాజా నివేదిక పేర్కొంది. 
 
రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎంఎం, హిందూస్థాన్ యునిలిర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ స్టాక్స్ షేర్లు బాగా పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది. 


రాహుల్ గాంధీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 24 స్టాక్‌లు ఉన్నాయి. వాటిలో మైండ్‌ట్రీ, టైటాన్, టీసీఎస్, నెస్లే ఇండియా అనే నాలుగు కంపెనీలలో మాత్రమే నష్టాలను చవిచూశాయి. 
 
ఇవి కాకుండా, వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్, వినైల్ కెమికల్స్ వంటి అనేక చిన్న కంపెనీల స్టాక్‌లు కూడా కాంగ్రెస్ నాయకుడి పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
 
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ మోపిన సెబి చీఫ్‌పై అభియోగాలపై జెపిసి విచారణను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments