Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన రెండు రోజులకే ప్రేయసిని లేపుకెళ్లాడు.. సోదరుడినని ఎంట్రీ ఇచ్చి..?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:13 IST)
ప్రేమ కోసం ఆ యువకుడు పెళ్లైన రెండు రోజులకే ప్రేయసిని లేపుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సోదరుడినంటూ ఆ అమ్మాయి మెట్టినింటికి వెళ్లిన అతడు ప్రేయసిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్ ఫిరోజాబాద్​లోని షికోహాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 25న ఓ జంటకు పెళ్లి జరిగింది. వివాహం తర్వాత పెళ్లి కూతురిని.. పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. వివాహం తర్వాత చేయాల్సిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే సమయంలో పెళ్లి కూతురు ప్రియుడు రంగప్రవేశం చేశాడు. 
 
తాను ఆమెకు సోదరుడినంటూ ఎంట్రీ ఇచ్చాడు. అందరినీ నమ్మించేశాడు. కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇదే అదునుగా కొత్త పెళ్లి కూతురిని ఆ ప్రియుడు ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికీ అనుమానం రాకుండా, గట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాడు. 
 
పెళ్లి కోసం తనకు పెట్టి నగలన్నీ ఆ అమ్మాయి వెంట పట్టుకెళ్లిపోయింది. సోదరుడినంటూ వచ్చిన అతడితో పాటు పెళ్లి కూతురు కూడా కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంత వెతికినా ఆ ఇద్దరూ దొరకలేదు. దీంతో ఈ విషయాన్ని పెళ్లి కూతురు కుటుంబానికి సమాచారం ఇచ్చిన.. పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లారు. ముమ్మరంగా గాలించారు. అయినా వారి జాడ దొరకలేదు.
 
వివాహమైన రెండు రోజులకే అమ్మాయి జంప్ అయిన విషయంపై పెళ్లి కొడుకు స్థానిక పోస్ స్టేషన్​‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం మరో ఫిర్యాదు చేశారు. ఇక పారిపోయిన ప్రేమికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments