శ్రద్ధను నేనే హత్య చేశా.. ఆ రోజున ఆ రంగు దుస్తులు ధరించివున్నది... అఫ్తాబ్

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (09:46 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కిరాతక ప్రేమికుడు అఫ్తాబ్ పూనావాలా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ నిందితుడికి జరిపిన నిజ నిర్ధారణ పరీక్షల్లో(నార్కో అనాలసిస్ టెస్ట్) నేరం చేసినట్టు చెప్పాడు. శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా ఎక్కడ దాచిపెట్టిందీ కూడా వెల్లడించారు. 
 
పైగా, శ్రద్ధను చంపినపుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నది కూడా చెప్పాడు. పైగా, ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ వివరాలను కూడా ఈ నిజ నిర్ధారణ పరీక్షల్లో వివరించాడు. ఆయనకు పాలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికీ తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. 
 
అంతకుముందు అఫ్తాబ్‌ ఉదయం 8.40 గంటల సమయంలో అధికారులు అఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 10 గంటల వరకు నార్కో పరీక్ష నిర్వహించారు. ఆతర్వాత అతడిని పరిశీలనలో ఉంచారు. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫోటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆస్పత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గుప్తా తెలిపారు. అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో పరీక్ష విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments