Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. టీ షర్టులు ధరించరాదంటూ ఆదేశం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (09:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను ప్రభుత్వం పరిచయం చేసింది. ఇందులోభాగంగా, వైద్య విద్యార్థులు టీ షర్టులు ధరించడానికి వీల్లేదని పేర్కొంది. గతంలో జారీచేసిన డ్రెస్‌కోడ్ ఆదేశాలు పాటించకపోవడంతో తాజాగా మరోమారు ఈ ఆదేశాలు జారీచేశారు. 
 
ముఖ్యంగా మహిళా విద్యార్థులు మాత్రం విధిగా చీర లేదంటే చుడిదార్ ధరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచించింది. స్టెతస్కోప్, యాప్రాన్ తప్పనిసరని తెలిపింది. అలాగే, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ఇకపై తమకు ఇష్టమైన జీన్స్ ప్యాంట్ ధరించడానికి వీల్లేదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
 
ఇప్పటికే నిర్ధేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినిలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలు ఇవ్వడాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీచేశారు. అలాగే, బోధనాసుపత్రులకు రోగుులు వస్తే కనుక వారికి సహాయకులు లేరన్న కారణంతో వారని చేర్చుకోవడం మానొద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments