Vijaydevarakondat ed office media
ఇటీవలే లైగర్ దర్శకుడు, నిర్మాత అయిన పూరీ జగన్నాథ్, చార్మికౌర్‌లను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. లైగర్ సినిమాకు కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా వచ్చింది? అసలు వీటి వెనుక పెట్టుబడిదారులు ఎవరున్నారనేది అడిగారు. ఆ తర్వాత వారినుంచి ఎటువంటి సమాధానం మీడియాకు రాలేదు. కాగా, బుధవారంనాడు లైగర్ హీరో విజయ్‌దేవరకొండను దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు తమ కార్యాలయంలో విచారణ చేశారు.
అనంతరం విజయ్‌దేవరకొండ మీడియా ముందు మాట్లాడుతూ, పేరు, ప్రఖ్యాతులు వస్తే ఇలాంటివి ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ తనకు తోడుగా వుంటుందని తెలిపారు. ఈడీ అధికారులు విధి నిర్వహణలో భాగంగా వారు తనను విచారణ చేశారనీ, త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశిస్తున్నానని అన్నారు.
లైగర్ సినిమా వసూళ్ళు రాబట్టలేకపోయింది. విడుదలైన అన్నిచోట్ల నెగెటివ్ టాక్‌తో ప్లాప్ సినిమాగా మారింది. మరి ఈడీ అధికారులు ఎందుకు లైగర్ టీమ్‌ను విచారిస్తున్నారనేది క్లారిటీలేదు. దీనివెనుక రాజకీయకోణం దాగివుందని సినీవిశ్లేషకులు తెలియజేస్తున్నారు.