Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైగర్‌ ఫెయిల్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసా!

Advertiesment
Vijay Devarakonda
, సోమవారం, 21 నవంబరు 2022 (15:38 IST)
Vijay Devarakonda
విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శ్‌ వీరంతా స్నేహితులు. సినిమానటుడిగా ఎదగాలని కలలు కన్నవారే. అంతాకలిసి ఒకేసారి ఇంచుమించు ఈ రంగంలోకి వచ్చారు. చాలా చోట్ల ఆడిషన్స్‌ ఇచ్చారు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగారు. పెళ్లిచూపులు సినిమాతో వారంతా ఒకేసారి వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరికివారు సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ విజయ్‌ దేవరకొండ ఒక్కో సినిమా చేస్తూ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చేసేశాడు. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు హిట్‌ వచ్చినా అంతకంటే పెద్ద సినిమాలు రాలేదు. అనుకోకుండా  పూరిజగన్నాథ్‌ వల్ల పాన్ ఇండియా లైగర్‌ సినిమా వచ్చింది. ఆ సినిమాతో ఒక్కసారిగా చాలా పెద్ద ఎత్తు ఎదిగాడు. కానీ సినిమా రిజల్డ్‌ ఒక్కసారిగా కిందికి దించేసింది.
 
ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శ్‌ను అడిగారు. ఒక్కసారిగా డౌన్‌ ఫాల్‌ అయ్యాడు మీ ఫ్రెండ్‌ విజయ్‌.. దీనికి గురించి మీరేమి చెబుతారు. అప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా వుంది. మీరేమి సలహాలు ఇచ్చారు? అని అడిగితే, రామకృష్ణ, ప్రియదర్శ్‌ కాస్త నెమ్మదిస్తూనే, ఇదంతా ఇండస్ట్రీలో మామూలే. పెద్ద వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్‌ చేశారని చెప్పారు. కాస్త బాధ వుండడం మామూలే. కానీ విజయ్‌దేవరకొండ ఇవన్నీ దాటేశాడు. సినిమా రంగంలోకి వచ్చేటప్పుడే ఇవన్నీ తెలుసుకున్నాం. అందుకు పాత తరం హీరోలు, హీరోయిన్లు ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే సహజంగా ప్రతి హీరోకూ ఓ టీమ్‌ వుంటుంది. కొత్తవారు పరిచయం అవుతారు. అలాంటివారిని అవాయిడ్‌ చేయాలని మాత్రం మేం గ్రహించాం. దానివల్ల కెరీర్‌ నాశనం అయిపోతుంది అంటూ తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి విలక్షణమైన నటుడు : ప్రధాని నరేంద్ర మోడీ