Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (14:53 IST)
మేఘాలయ హనీమూన్‌కు వెళ్లిన జంటలో వరుడు హత్య కేసులో తెరపైకి వచ్చిన సంజయ్ వర్మ ఎవరు మిస్టరీని పోలీసులు తేల్చారు. సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు. 
 
ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను సంజయ్ వర్మ పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత కూడా సోనమ్, సంజయ్ అలియాస్ రాజ్ కుశ్వాహాలు ఫోనులో మాట్లాడుకున్నారని, 39 రోజుల వ్యవధిలో 324 సార్లు ఫోన్ చేసుకున్నట్టు తేలింది. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడన పోలీసుల స్పష్టం చేశారు. 
 
కాగా, సంజయ్ వర్మ గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది అని అన్నారు. రాజా హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments