Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులను ఉరితీసేందుకు పోటాపోటీ

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (15:27 IST)
నిర్భయ కేసులో దోషులను ఉరితీసేందుకు పలువురు పోటీపడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఉరితీసేందుకు ముందుకువచ్చారు. తనను తాత్కాలిక తలారిగా నియమిస్తే తాను నిర్భయ దోషులను ఉరితీస్తానంటూ ప్రటించారు. అలాగే, ఇపుడు మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ గుప్తా కూడా స్పందించారు. 
 
ఆ న‌లుగురికి ఉరి వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, నిర్భ‌య అత్యాచార కేసులో న‌లుగురికి ఉరిశిక్ష ఖ‌రారైంది. ఆ నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్షే స‌రైంద‌ని త‌లారి ప‌వ‌న్ చెప్పాడు. 
 
మరోవైపు, తీహార్ జైలులో నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. గ‌త ఆర్నెళ్ల నుంచి నిర్భ‌య నిందితుల‌కు జైలు అధికారులు ఎటువంటి ప‌ని అప్ప‌గించ‌లేదు. ఉరి గురించి వార్త‌లు రావ‌డంతో నిందితులు డిస్ట‌ర్బ్ అయిన‌ట్లు తెలుస్తోంది. నిందితుల‌ను ప్ర‌తిక్ష‌ణం సీసీటీవీల ద్వారా మానిట‌ర్ చేస్తున్నారు. 
 
క్రమం తప్పకుండా వైద్య ప‌రీక్ష‌లు కూడా చేస్తున్నారు. ఉరితాడు కోసం తీహార్ జైలు అధికారులు బీహార్ జైళ్ల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. బ‌క్స‌ర్ జైలు నుంచి 10 కొత్త ఉరితాళ్ల‌ను ఆర్డ‌ర్ చేశారు. బాక్స‌ర్ జైలులో ఉన్న ఖైదీలే ఉరితాళ్ల‌ను త‌యారు చేస్తారు. కాగా, నిర్భయ కేసులో ఆరుగురికి శిక్ష ప‌డింది. దాంట్లో ఒక‌రు బాల నేర‌స్థుడు కాగా, రామ్ సింగ్ అనే మ‌రో నిందితుడు తీహార్ జైలులోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments