కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరంను సీబీఐ అరెస్టు చేయగా, కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలులో ఉన్నారు.
ఆయనకు శనివారం ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. శనివారం తీవ్రమైన కడుపునొప్పితో.. బాధపడుతుంగా.. జైలు అధికారులు చిదంబరాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మళ్లీ తిరిగి జైలుకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు.
కాగా.. జైలులోని ఫుడ్ కారణంగా.. ఆయన ఇప్పటికే 4 కేజీల బరువు తగ్గారు. ఆ తర్వాత ఆయన అభ్యర్థన మేరకు కోర్టు ఆయనకు ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు, ఆయన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.
2004-2014 మధ్య చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపు రూ.305 కోట్ల విదేశీ నిధులను.. అక్రమంగా పొందినట్లు ఆరోపణలతో 2017 మే 15న ఆయనపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2019, ఆగష్టు 21న అరెస్టు చేశారు.