Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

నిర్భయ దోషులను ఉరితీసేందుకు సిద్ధం : 'సిమ్లా' రవికుమార్

Advertiesment
Himachal Pradesh
, గురువారం, 5 డిశెంబరు 2019 (10:18 IST)
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తలారి లేరంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. పైగా, తలారీ పోస్టును భర్తీ చేయాల్సిందిగా ఢిల్లీ తీహార్ జైలు అధికారులు జైళ్ళ శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులను ఉరితీసేందుకు తాను సిద్ధమంటూ సిమ్లాకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. 
 
నిర్భయ కేసులో దోషులను ఉరితీయడానికి తనను తాత్కాలిక తలారీగా నియమించాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు రవికుమార్ ఓ లేఖ రాశారు. దోషులను ఉరితీయడానికి తీహార్ జైలు అధికారులు సన్నద్ధమవుతున్నారని, తలారీ లేడనే విషయాన్ని రవికుమార్ మీడియా ద్వారా తెలిసి, ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. దోషులను ఉరితీయడం వల్ల నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. భారత్‌లో అరుదుగా ఉరితీస్తుండటంతో తలారీలను నియమించడం లేదు.
 
దేశంలో కలకలం రేపిన ఘటన నిర్భయ అత్యాచార హత్య కేసు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి అనే మహిళ కుమార్తె నిర్భయ (23)ను ఆరుగురు కామాంధులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి నుంచి 17 తెల్లవారుజాము వరకూ ఈ దారుణం జరుగగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు కన్నుమూసింది. దేశ యువతలో వెల్లువెత్తిన నిరసనతో చట్టాలు కఠినమయ్యాయి. కొత్తగా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, ఈ కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్షలు విధించగా, ఇప్పటివరకు వరకు ఆ శిక్షలు అమలు చేయలేదు. 
 
తీహార్ జైల్లో చివరిగా పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురును ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో తలారిని నియమించకుండానే, జైలు అధికారులు ఉరికంబానికి ఉండే లివర్‌ను లాగి, శిక్షను అమలు చేశారు. ప్రస్తుతం ఇతర ప్రధాన జైళ్లలో ఎవరైనా తలారి ఉన్నారా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, ఎవరైనా దొరికితే, అతన్ని తీహార్‌కు తాత్కాలికంగా బదిలీ చేయించి, శిక్ష అమలుకు ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు. 
 
కాగా, నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి వుంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్ ఎస్టేట్ పైనే కేసీఆర్ దృష్టి: బీజేపీ