పద్మావతి రచ్చ... ప్రధానమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రబ్రీదేవి

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. పద్మావతి సినిమాలో నటించినందుకు ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే తలకు బీ

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (15:51 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. పద్మావతి సినిమాలో నటించినందుకు ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే తలకు బీజేపీ నేత ఒకరు రూ.10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీజేపీ అధిష్టానం ఆ నేతలకు సమన్లు జారీ చేసింది.
 
ఈ నేపథ్యంలో, మంగళవారం జరిగిన ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బీహార్‌లో చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతు కోసేందుకు, ఆయన చేతులు నరికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసేవారి వేళ్ళు నరుకుతామని వాళ్ళు అంటున్నారని, అలా చేస్తే, ఊరికే కూర్చునేందుకు దేశంలో ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీహార్ జనం ఏమీ అనరా? మోడీ తల నరికేందుకు, ఆయన చేతిని ముక్కలు చేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. ఇందుకోసం తాము జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments