చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు : ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (14:04 IST)
చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భ‌గ‌త్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ తెలిపారు. ఆదివారం మ‌న్ కీ బాత్ 93వ ఎడిష‌న్‌లో దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఆలిండియా రేడియోలో మాట్లాడారు. మొహాలీ - చండీగ‌ఢ్ ఎయిర్‌పోర్టు పేరును షాహీద్ భ‌గ‌త్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు.
 
మొహాలీ-చండీగ‌ఢ్ ఎయిర్‌పోర్టు పేరును షాహీద్ భ‌గ‌త్‌సింగ్ ఎయిర్‌పోర్టుగా మార్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని తామే కోరామ‌ని పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ తెలిపారు. హ‌ర్యానాకు చెందిన పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి దుశ్యంత్ చౌతాలా, తాను సంయుక్తంగా ఈ విష‌యంపై కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌కు లేఖ రాశామ‌ని మాన్ గుర్తు చేశారు. 
 
ఈ నెల 28న భ‌గ‌త్‌సింగ్ జ‌యంతి ఉందని, ఆలోపే ఎయిర్‌పోర్టుకు ఆయ‌న పేరు పెట్టాల‌ని లేఖ‌లో కోరిన‌ట్లు భ‌గ‌వంత్ మాన్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌ధాని మోడీ ఎయిర్‌పోర్టుకు భ‌గ‌త్‌సింగ్ పేరు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంద‌ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments