Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యధరా సముద్రంలో మునిగిన నౌక.. 77 మంది వలసదారుల మృతి

Lebanon Migrant
, ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:59 IST)
పొట్టకూటి కోసం సిరియా దేశానికి వలస వెళుతున్న కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ ఒకటి మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది జలసమాధి అయ్యారు. 
 
లెబనాన్ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. దీంతో పొరుగు దేశాలకు ఆ దేశ ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్రమ మార్గాల్లో ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 150 మందితో సిరియా బయలుదేరిన ఓ పడవ ఒకటి సిరియా తీరానికి చేరుకోగానే సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది చనిపోయారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసి వుంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను ప్రాణాలతో రక్షించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మంచి ఎక్కడ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణిగుంటలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు మృతి