సిరియా రాజధాని డమస్కస్‌లో ఓ మిలిటరీ బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. జిసర్ అల్ రయిస్ బ్రిడ్జ్‌ను దాటుతున్న సమయంలో రెండు బాంబులతో వాహనాన్ని పేల్చేశారు. వాస్తవానికి సిరియాలో గత దశాబ్ధ కాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉన్నది. అయితే ఇటీవల దేశ రాజధాని డమస్కస్‌లో మళ్లీ దాడి ఘటనలు పెరిగాయి.
ఇడ్లిబ్ ప్రావిన్సులో ఉన్న అరిహ పట్టణంలో జరిగిన మరో దాడిలో అనేక మంది స్కూల్ విద్యార్థులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అసద్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 2011 నుంచి సిరియాలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పటి వరకు ఆ పోరాటంలో 3.50 లక్షల మంది మరణించారు. సగం మంది జనాభా తమ స్వంత ఇండ్లను విడిచి వెళ్లారు.