బతుకుతెరువు కోసం పొట్టచేతపట్టుకుని వెళ్తున్న వలసదారుల పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. దీంతో 77మంది మృతి చెందారు. తీవ్ర ఆర్థిక మాద్యంలో కూరుకుపోయిన లెబనాన్‌లో ఉపాధి కరువవడంతో అక్కడి ప్రజలు సిరియాకు సముద్రమార్గంలో అక్రమంగా వలస వెళ్తున్నారు.
ఈ క్రమంలో సిరియా సముద్ర తీరంలో వారి పడవ మునిగిపోయిందని, 77 మంది చనిపోయారని సిరియా ఆరోగ్య శాఖ మంత్రి హసన్ అల్ ఘబాశ్ తెలిపారు. మరో 20 మందిని కాపాడామని ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ప్రమాదం సయంలో పడవలో సుమారు 150 మంది ఉన్నారన్నారు.