Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ పార్టీపై కేసు పెడతానంటున్న కన్నడ యువ హీరో

akhil ayyar
, ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (11:56 IST)
కాంగ్రెస్ పార్టీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఓ కన్నడ యువ హీరో సిద్ధమవుతున్నారు. ముందస్తు అనుమతి లేకుండా తన ఫోటోను వాల్‌పోస్టర్లపై ముద్రించినందుకుగాను కాంగ్రెస్ పార్టీపై కేసు పెట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
ఇటీవల కర్నాటకలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచార పోస్టర్లను ముద్రించింది. బీజేపీపై కాంగ్రెస్ దాడిని పెంచడంతో బెంగుళూరు అంతటా కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిత్రంతో "పేసీఎం పోస్టర్లు" ముద్రించి నగర వ్యాప్తంగా అంటించింది. 
 
బీజేపీ హయాంలో ప్రతీ పనికి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న "40 శాతం సర్కార్" అంటూ మరికొన్నిపోస్టర్లు ముద్రించింది. ఇలాంటి పోస్టర్లలో కన్నడ యువ నటుడు అఖిల్ అయ్యర్ ఫోటోను ముద్రించారు. "మీరు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా? ఈ 40 శాతం సర్కారు 54000 మంది యువకుల కెరీర్‌ను దోచుకుంది. దీనిపై స్పందించి. సర్కారు అవినీతిని ఎండగట్టండి" అని పోస్టర్లను ప్రచారం చేస్తుంది. 
 
ఈ విషయం తెలిసిన అఖిల్ అయ్యర్ తన ఫోటోను చట్టవిరుద్ధంగా ఉపయోగించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పోస్టర్లలో నా ముఖాన్ని చట్టవిరుద్ధంగా, నా సమ్మతి లేకుండా ఉపయోగించడాన్ని చూసి నేను భయపడిపోయాను. ఈ ప్రచారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని ట్వీట్ చేశారు. అలాగే, దీనిపై స్పందించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ శాఖలను ట్యాగ్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో తల్లి, ఇద్దరు కవల పిల్లలు ఆత్మహత్య