Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భారీ వర్షాలు - కొండ చరియలు విరిగిపడి...

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:31 IST)
మణిపూర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం ఉదయానికి 14కు చేరింది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మందిని సురక్షితంగా రక్షించారు. 
 
మరోవైపు, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైలు నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొలుత ఏడుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. 70 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, శుక్రవారాం ఉదయానికి ఈ మృతుల సంఖ్య 14కు చేరింది. 
 
ఈ ప్రమాదంలో మణిపూర్ డీజీపీ డౌంగెల్ స్పందిస్తూ, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకునివున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే, దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చన్న అంచనాలు వేస్తున్నట్టు చెప్పారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని ఆయన తెలిపారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లేనని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments