మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టించించి. 30 మంది నిరసనకారులను కాల్చివేసింది. 11 నెలల క్రితం ప్రభుత్వాన్ని కూల్చివేసిన మయన్మార్ సైన్యం.. అప్పటి నుంచి దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంది. అయితే, సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రాలు సాగుతున్నాయి. ఈ నిరసనకారులపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.
ఇందులోభాగంగా 30 మది నిరసనకారులను కాల్చివేసింది. ఆపై మృతదేహాలను ట్రక్కులో పడేసి తగలబట్టేసింది. కానీ, మయన్మార్ సైన్యం మాత్రం మరోమాలా నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది.
కయా రాష్ట్రంలోని హెచ్‌ప్రుసో పట్టణం, పో సో పొరుగు గ్రామమైన కియో గాన్ గ్రామంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మారన్ సైన్యానికి మధ్య భీకర పోరుసాగింది. ఈ క్రమంలో శరణార్థి శిబిరాలకు పారిపోతున్న వారిపై సైన్య విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.
ఈ కాల్పుల్లో 30 మందికిపై పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మానవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మానవ హక్కులను ఉల్లంఘించే అమానవీయ, క్రూరమైన ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.