Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైలర్‌ షర్టు సరిగ్గా కుట్టలేదని.. కత్తెరతో గొంతు కోసి చంపేశాడు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (13:36 IST)
టైలర్ బట్టలను కరెక్ట్‌గా కుట్టివ్వకపోతే.. అరుస్తూ వుంటాం. కానీ ఓ వ్యక్తి టైలర్ కాలర్ సరిగ్గా కుట్టలేదని దారుణంగా హతమార్చాడు. తన షర్టు సరిగా కుట్టలేదనే కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి టైలర్ గొంతు కోసి చంపేసిన ఘటన యూపీలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. రాయ్ బరేలికి చెందిన అబ్దుల్ మజీద్ ఖాన్ అనే 65 ఏళ్ల టైలర్‌కు సలీం అనే వ్యక్తి ఓ షర్టు క్లాత్ ఇచ్చి షర్టు కుట్టమన్నాడు. దానికి సలీం కొలతలు కూడా తీసుకున్నాడు మజీద్ ఖాన్. ఆ తరువాత కొన్ని రోజులకు అంటే గత ఆదివారం (జనవరి 7) రాత్రి షర్టు పట్టుకెళ్లటానికి సలీం వచ్చాడు.
 
దీంతో తాను కుట్టిన షర్టును సలీంకు ఇచ్చాడు. అక్కడిక్కడే షర్టు ధరించి చూసుకున్నాడు సలీం. కానీ చాలా టైటుగా ఉంది. అదేమని టైలర్ మజీద్ ఖాన్‌పై సలీం ఆగ్రహం వ్యక్తం చేశాడు. నానా దుర్భాషలాడాడు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు. అలా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అదికాస్తా.. ఘర్షణకు దారి తీసింది.
 
ఆ ఘర్షణలో టైలర్ అబ్దుల్ మజీద్ ఖాన్‌ను అక్కడే ఉన్న కత్తెరతో గొంతు కోసి చంపేశాడు. నెత్తుటి మడుగులో గిలగిలలాడుతూ మజీద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సలీం అనే వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడని టైలర్ కుమారుడు అబ్దుల్ నయీమ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments