Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై క్రైమ్.. టిక్‌ టాక్‌లో వీడియోలు, బిజీ టోన్.. భార్యను కత్తితో పొడిచిన భర్త

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (19:03 IST)
తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే ఓ మహిళను భర్తే హత్య చేశాడు. టిక్ టాక్‌లో తరచూ వీడియోలు పోస్టు చేయడం.. స్మార్ట్ ఫోన్‌లో అధిక సమయం గడపడంతో విసుగెత్తిన భర్త.. భార్యను కాలేజీలోనే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, కుళత్తుపాలయం ప్రాంతానికి చెందిన కనకరాజ్‌కు, నందిని దంపతులు ఇద్దరు సంతానం వున్నారు. నందిని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ వచ్చేది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విబేధాల కారణంగా నందిని భర్తకు ఏడాది పాటు దూరం వుంటోంది. అమ్మగారింట పిల్లలతో పాటు వుంటున్న నందినిపై భర్త కక్ష్య పెంచుకున్నాడు. 
 
దీనికితోడు నందిని భర్తను విడిపోయిన దిగులు లేకుండా అప్పుడప్పుడు టిక్ టాక్‌లో వీడియోలు పోస్టు చేయడం, గంటల పాటు స్మార్ట్‌ఫోనులో గడపటం చూసిన కనకరాజ్‌కు ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీనిపై కనకరాజ్, నందినిల మధ్య గొడవలు కూడా జరిగాయి. శుక్రవారం కనకరాజ్ నందినికి ఫోన్ చేశాడు. కానీ ఆమె లైన్ కలవలేదు. 
 
బిజీ టోన్ రావడంతో ఇక లాభం లేదనుకుని కాలేజీకే వెళ్లాడు. అక్కడ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగులాట ముదరడంతో తన వద్దనున్న కత్తితో నందినిని కనకరాజ్ పొడిచేశాడు. దీంతో కుప్పకూలిన నందిని చూసి కనకరాజ్ అక్కడ నుండి పారిపోయాడు. 
 
కానీ ఈ ఘటనలో తీవ్రగాయపడిన నందినిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనకరాజ్‌ను అరెస్ట్ చేశారు.

భార్యపై కనకరాజ్‌కు అనుమానం ఎక్కువని.. అందుకే ఇద్దరి మధ్య గొడవలు అప్పుడప్పుడు జరిగేవని.. ఆ అనుమాన భూతమే.. నందినిని చంపేశాయని.. ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఇంకా నందిని ఇద్దరు పిల్లలు తల్లి లేని పిల్లలుగా మిగిలిపోయారని వారు ఆవేదన చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments