Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యతో ఎఫైర్.. అంతే తమ్ముడితో కలిసి?

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (09:50 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యతో స్నేహితుడి ఎఫైర్‌ సహించని ఓ భర్త సోదరుడితో కలిసి అతడిని హతమార్చిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బందూప్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  
 
బందూప్ ఏరియాలో అవినాష్ అశోక్ థొరానే (31) అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు అశ్విన్ అశోక్ థొరానే (24)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సెవ్రీలోని ఓ కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ అవినాష్ (24) స్నేహితుడు. అవినాష్ ద్వారా ఘట్కోపర్‌లోని కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ సూరజ్ పతాయిత్ (24) పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో ఇంటికి వెళ్తూ రావడం ప్రారంభించాడు. 
 
ఆ సందర్భంలో అవినాష్‌ భార్యతో సూరజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న అవినాష్ థొరానే, తన తమ్ముడు అశ్విన్‌, స్నేహితుడు అవినాష్‌తో కలిసి సూరజ్‌ను హత్య చేశాడు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములైన అవినాష్ థొరానే, అశ్విన్ థొరానేలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, సివిల్ ఇంజినీర్ అవినాష్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments