Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కోరిక జెట్టి సినిమాతో నెరవేరిందిః నందిత శ్వేతా

Nandita Shweta
, మంగళవారం, 4 అక్టోబరు 2022 (18:28 IST)
Nandita Shweta
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది.
 
webdunia
Venu Madhav, Subrahmanyam Picchuka, nandita
ఈ సందర్భంగా  హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ...విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు.  నిర్మాత వేణు గారు సినిమా ప్రారంభం నుంచీ చివరి దాకా ఒకటే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. జెట్టితో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది. అని చెప్పింది. 
 
దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ది బెస్ట్ వర్క్ నిర్మాత‌లు చేయిస్తున్నారు. మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. కొందరు తమ స్వార్థంతో  పోర్టుల పేరుతో వారి మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇట్రెస్టింగ్ గా తెరకెక్కించాం. హీరో హీరోయిన్లతో పాటు పలువురు మైమ్ గోపీ వంటి స్టేజీ ఆర్టిస్టులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అన్నారు. 
 
నిర్మాత  వేణు మాధవ్ కె మాట్లాడుతూ, జెట్టి అంటే పోర్టు అని అర్థం. మన సముద్ర తీరాన ఎంతోమంది మత్స్యకారులు జీవితాలను సాగిస్తున్నారు. వీళ్లు నివసించే ప్రాంతాల్లో పోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ల జీవనోపాధిని కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు దెబ్బతీస్తున్నారు. కష్టపడితే గానీ రోజు గడవని పరిస్థితి వారిది. అలాంటి మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను ప్రతిబింబించే చిత్రమిది. సగటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం ఆకర్షణ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది సినిమా. ఈ నెల 28న మూవీని విడుదల చేయబోతున్నాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటివరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక తీసుకురాబోతున్నాడు. అన్నారు.
 
హీరో మన్యం కృష్ణ మాట్లాడుతూ...ప్రేక్షకులకు జెట్టీ సినిమా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సిినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం నిర్మాత వేణు, దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు కారణం. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రతో మీ ముందుకొస్తున్నాను. మిమ్మల్ని సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 28న థియేటర్లలో చూడండి. అన్నారు.
 
సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ...ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దొరికింది. ఈ పాటకు ఫలానా సింగర్ కావాలి అనుకుంటే కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఇచ్చారు. అలా సిధ్ శ్రీరామ్, సునీత వంటి సింగర్స్ తో పాటలు పాడించాం. హృద్యమైన కథా కథనాలతో పాటు మ్యూజికల్ గా సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతానుః ది ఘోస్ట్ హీరో నాగార్జున