Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లెహరాయి చిత్రం నుండి బేబీ ఒసేయ్ బేబీ పాట వ‌చ్చేసింది

Advertiesment
Ranjith, Soumya Menon
, మంగళవారం, 4 అక్టోబరు 2022 (17:11 IST)
Ranjith, Soumya Menon
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో రూపొందుతోంది.
 
ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది.
 
ఈ స‌క్సస్ ని పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి "బేబీ ఒసేయ్ బేబీ" అనే మరో  సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటని సాకేత్, కీర్తన శర్మ   ఆల‌పించారు. ఉత్సాహభరితమైన పాటలను రాసే శ్యామ్ ఈ పాటను కూడా అదే తరహాలో రాసారు. 
"గాడి మీద కూసోబెట్టి ఊరు మొత్తం తిప్పుతుంటే... జోడి మస్తు గున్నదంటూ సూసినోళ్లు మెచ్చబట్టే... దూరమెంత ఉన్నాగాని దారమల్లె చుట్టేస్తాష అంటూ మరోసారి కాసర్ల శ్యామ్ మార్క్ ను గుర్తుచేశాయి. 
 
ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస" తెలిపారు.ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడిని ముఖ్యమంత్రిని చేసేందుకు మద్దతిస్తానేమో? చిరంజీవి