12వ భార్యను కొట్టి చంపిన భర్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (12:05 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కిరాతక భర్త తన 12వ భార్యను కర్రతో కొట్టి దారుణంగా చంపేశాడు. గయాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌దార్‌ పంచాయితీ తారాపుర్‌ గ్రామానికి చెందిన రామచంద్ర, సావిత్రీదేవి అనే దంబతులు ఉన్నారు. 
 
రామచంద్ర ఆదివారం మద్యం తెచ్చుకుని ఇంట్లోనే తాగుతున్నాడు. ఆ సమయంలో భార్య సావిత్రీదేవితో అతనికి గొడవ జరిగింది. 
 
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రామచంద్ర.. భార్యపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సావిత్రీదేవి.. అక్కడికక్కడే మృతి చెందింది. 
 
'నిందితుడు రామచంద్రకు ఇప్పటివరకు 12 పెళ్లిళ్లు అయ్యాయి. సావిత్రీ దేవి 12వ భార్య. ఆమెకు ఇది వరకే పెళ్లైంది. 
రామచంద్రతో గొడవ పెట్టుకుని మిగతా 11 మంది భార్యలు.. అతణ్ని విడిచిపెట్టి వెళ్లారు. 
 
రామచంద్రకు పిల్లలు లేరు. సావిత్రీదేవికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు అని గ్రామస్థులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments