రాణి దుర్గావతి యూనివర్శిటీలో బాంబు దాడి - పేలని బాంబులు స్వాధీనం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో బాంబు దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ దండుగుడు ఈ బాంబు దాడికి పాల్పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ రెండు బాంబులు పేలకపోవడంతో పెను విపత్తు తప్పింది. బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులను ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్ళు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని బైకుపై పారిపోయాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగింది. 
 
అదేసమయంలో ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాంబు దాడి వార్త తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పేలకుండా ఉన్న రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ గౌరవ్ మాట్లాడుతూ, యూనివర్శిటీలోని క్యాంటీన్ బయట గుర్తు తెలియని వ్యక్ి బాంబులు విసిరినట్టు తమకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలించాం. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments