బిర్యానీ తిన్న విద్యార్థిని మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పోస్టు మార్టంలో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కేరళలో బిర్యానీ తిని ఓ విద్యార్థిని మరణించింది. అయితే తాజాగా పోస్ట్‌మార్టం పరీక్షలో విస్మయకరమైన వాస్తవం వెల్లడైంది.
కేరళలో అంజు శ్రీ పార్వతి అనే 19 ఏళ్ల విద్యార్థిని కాసరగోడ్ ప్రాంతానికి చెందింది. ఈ బాలిక గత నెలలో ఓ హోటల్‌లో నాసిరకం బిర్యానీ తిని మరణించడం తీవ్ర సంచలనం రేపింది.
అయితే విద్యార్థి మృతికి కారణం ఎలుకల మందు అని తాజాగా తేలింది. విద్యార్థిని అంజు శ్రీ పార్వతి తన సెల్‌ఫోన్‌లో ఎలుకల మందు గురించి గూగుల్ చేసిందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
దీని తర్వాత విద్యార్థిని అంజుశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, బిర్యానీ తిని చనిపోలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.