Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్ జంట... బిడ్డకు జన్మనిచ్చిన జంట

Advertiesment
Trans Couple
, గురువారం, 9 ఫిబ్రవరి 2023 (09:39 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట చరిత్ర సృష్టించింది. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన ఈ జంటకు తాజాగా ఓ పండంటి బిడ్డ పుట్టింది. అయితే, పుట్టింది మగబిడ్డో లేక ఆడబిడ్డో అనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. 
 
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌కు చెందిన జహాద్, జియా పావర్ అనే ట్రాన్స్‌జెండర్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తమకు ఓ సంతానం కావాలని భావించారు. ఎవరినైనా దత్తత తీసుకుకోవాలని తొలుత భావించారు. అయితే, దత్తత నిబంధనలు కఠినంగా ఉండటంతో ఆ ప్రతిపాదనను విరమించారు. దీంతో సొంతంగా సంతానం కనాలని నిర్ణయం తీసుసుని, ఆ జంట తమ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
ఇందులోభాగంగా, జియా, జహాద్‌లు స్త్రీపురుషులుగా మారారు. ఫలితంగా జహాద్ గర్భందాల్చింది. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఇటీవల జహాద్, జియాపావెల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఇపుడు బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఏకంగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం బేబీ, జహాద్ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ విషయం తెల్సిన ట్రాన్స్‌ జెండర్స్ ఇపుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అభినందలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.2500 కోట్లు ఇచ్చాం : కేంద్రం