21 రోజులు.. తల్లి మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (10:52 IST)
మూఢ నమ్మకం కారణంగా ఓ యువకుడు తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే 21 రోజులు వుంచాడు. తల్లి మృతదేహంతోనే కాలం గడిపాడు. ఎవరైనా మరణించిన 21 రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే మూఢనమ్మకంలో ఓ యువకుడు తన తల్లి విషయంలో అదే చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు పట్టుబడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకున్నాడు. తల్లి కృష్ణ (77)తో కలసివుంటున్న మైత్రేయ 18 రోజుల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మృతదేహాన్ని ఖననం చేయకుండా మైత్రేయ అలానే వుంచాడు. 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా వుంచాలని చూశాడు. 
 
అలా 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలని అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments