Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కూతురిపై కన్నేశాడు.. చివరికి..?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (10:10 IST)
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తద్వారా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఓ వ్యక్తి రెండేళ్ల పాటు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా సదరు మహిళ కూతురిపై కూడా కన్నేశాడు. మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె కూతురిని లైంగికంగా వేధించాడు. తనకు లొంగిపోవాలని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూడా సాయం చేయకుండా.. దారుణంగా ప్రవర్తించింది. ఈ విషయం బయటికి చెప్పకూడదని కూతురినే బెదిరించింది. దీంతో బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. అద్దంకి పట్టణానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. బాలిక.. ఓ ప్రైవేట్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. కాగా.. కొంత కాలం క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కూతురు మాత్రం తల్లితోనే ఉంటోంది. కాగా.. తల్లి చినగంజాంకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తితో కొద్దికాలంగా సహజీవనం చేస్తోంది. 
 
అతను మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే.. ఆమె కూతురు పై కూడా  కన్నేశాడు. బాలికను కూడా తాను దక్కించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తల్లికూడా కామాంధుడికి వంత పాడటంతో తల్లి ప్రవర్తను విస్తుపోయిన బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం