Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటిచూపు లేని బాలికను వేధించాడు.. కానీ చేతులు ఎలా విరగ్గొట్టిందో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (17:50 IST)
ముంబై నగరానికి చెందిన రైలులో కంటి చూపు లేని ఓ బాలికకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. అయితే కంటిచూపు లేకపోయినా.. తనను లైంగికంగా వేధించిన వ్యక్తికి ఆ బాలిక సరిగ్గా బుద్ధి చెప్పింది.


వివరాల్లోకి వెళితే.. ముంబై శివారు ప్రాంతమైన కల్యాణ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక తన తండ్రితో కలిసి రాత్రి 8.15 గంటలకు రైలు ఎక్కింది. అంధులకు, వికలాంగుల కోసం కేటాయించబడిన ప్రత్యేక భోగీలో ఎక్కింది. ఆ సమయంలో బాలికకు తెలియకుండా.. ఆమె పక్కన కూర్చున్న ఓ వ్యక్తి లైంగికంగా వేధించడం మొదలెట్టాడు.
 
అయితే ఎవరో ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఆ బాలిక.. ఆ వ్యక్తి చేతుల్ని గట్టిగా పట్టుకుంది. అతడి చేతుల్ని విరిచేలా చేసింది. ఆ నొప్పికి తట్టుకోలేక ఆ వ్యక్తి అరవడంతో ఆ భోగీలోని ప్రయాణీకులు అతనికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులకు విషయం చేరవేశారు. కంటిచూపు లేకపోయినా ఆ బాలిక ఆ కామాంధుడికి సరిగ్గా బుద్ధి చెప్పిందని.. తోటి ప్రయాణీకులు ప్రశంసించారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా అతని వద్ద జరిపిన విచారణలో 24 ఏళ్ల విశాల్ అనే అతడు కంప్యూటర్ మెయింటెన్స్ ఉద్యోగం చేస్తున్నాడని.. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించాడని తెలిసింది. అలాగే అతనికి బుద్ధిచెప్పిన కంటిచూపు లేని బాలికకు మార్షల్ ఆర్ట్స్ తెలుసునని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం