Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ చిలుక అరుపులను భరించలేకపోతున్నాను.. కాపాడండి...

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (13:44 IST)
పక్షుల్లో రామ చిలుకని కూడా అంతే ఇష్టంగా పెంచుకుంటారు. అయితే తన పొరుగింట్లోని రామ చిలుక చేసే సందడి.. అల్లరి ఓ వ్యక్తికీ నచ్చలేదు. దీంతో నేను రామ చిలుక అరుపులను భరించలేకపోతున్నాను బాబోయ్ అంటూ పోలీసు గడప ఎక్కాడు. యజమానిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. పూణే నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో చిలుక అరుపులు తనకు చికాకుని తెప్పిస్తున్నాయని ఫిర్యాదు రావడంతో.. ఆ పక్షి యజమానిపై కేసు బుక్ చేశారు పోలీసులు. ఈ విచిత్రమైన సంఘటన ఆగష్టు 7  జరిగింది. శివాజీ నగర్ ప్రాంతంలో సురేశ్​ శిందే అనే 72 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 
 
సురేష్ పక్క ఇంట్లో అక్బర్ అంజద్​ ఖాన్​ నివాసం ఉంటున్నాడు. అక్బర్ ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఈ పెంపుడు చిలుక ఎప్పడూ అరుస్తూనే ఉందని.. దీనిని ఈలలను తనకు భరించలేకపోతున్నానంటూ.. సురేశ్​ శిందే  ఖడ్కి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అతనికి హామీనిచ్చారు.
 
నగరంలోని పాటిల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన అక్బర్ అంజద్​ ఖాన్​ పెంపుడు చిలుక ఈలలు వేస్తుండడంతో సురేష్ ఆ పక్షిని వేరే చోట పెట్టమని ఖాన్‌ను కోరినట్లు పోలీసులు చెప్పారు. అయితే పక్షిని వేరే చోట తరలించమని కోరడంతో అక్బర్.. సురేష్ ని దుర్భాషలాడాడని తెలిపారు. 
 
చివరకు చిలుక విజిల్స్‌తో విసిగిపోయిన షిండే, పెంపుడు జంతువు యజమానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. సంబంధిత చట్టాలకు అనుగుణంగా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments