Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళగిరిలో 8వ జాతీయ చేనేత దినోత్సవం

handloom
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:38 IST)
ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర చేనేత కార్యాలయం వద్ద చేనేత జండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. 8వ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ జెండాను ఎగురవేశారు. 
 
అనంతరం పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ మనదేశం స్వాతంత్రం సాధించాలి అంటే విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ వస్తాలను వాడాలిని తీర్మానం 1905న కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమర సంఖరావం పూరించటం జరిగిందన్నారు. 
 
దేశంలోని ప్రతి గ్రామంలోనూ విదేశీ వస్త్రాలను రోడ్లపైన వేసి తగలబెట్టిన సందర్భంగా బ్రిటీష్ ప్రభుత్వంపోలీసులను పంపి మగవారిని చిత్రహింసలు చేసి ఆడవారిని వివస్త్రాలను చేసి చిత్రహింసలకు గురిచేసినప్పటికీ మొక్కవోని దీక్షతో ఎదురుతిరిగి స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక మలుపు తిప్పిన చరిత్ర చేనేతకు వుందని అటువంటి చేనేత ను కాపాడుకోవలసిన అవసరం ప్రతి భారతీయుడు పైన వుందని అన్నారు. 
 
ఈ చేనేత దినోత్సవం సందర్భంగానైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతల రక్షణ కోసం వున్నామని ఒట్టి మాటలు కాకుండా పరిష్కారం దిశగా అడుగులు వేయడం ద్వారా చేనేతకు రక్షణ కల్పిచాలని కరోనా కష్టకాలంలో పనులులేక అర్ధాకలితో ఒకవైపు ఆత్మహత్యలు ఒకవైపు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమబడ్జెట్లో కేవలం రూ.200 వందల కోట్లు కేటాయించటం చాలా దారుణమన్నారు. 
 
2021లో పట్టు 3 వేల రూపాయలు వుంటే ఈ రోజు 8 వేల రూపాయలు వుందన్నారు. అలాగే కాటన్ నూలు ధరలు పెరిగినట్టు తెలిపారు. ఇవి చాలదన్నట్లు బ్రిటీష్ కాలంలో కూడా చేనేతకు పన్ను లేదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్టికల్ 43లో గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితాలో స్థానం కల్పించి చేనేత కు పన్ను లేకుండా ఆనాడు ప్రభుత్వాలు చేశాయని, కానీ, చేనేతను ఉద్ధరిస్తాం, రక్షణగా వుంటామని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత చేనేతపై పన్నులు వేయటం దుర్మార్గం అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓహియో రాష్ట్రంలో కాల్పులు... నలుగురు మృతి