Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలతో రాజకీయమా.. మీకు సిగ్గుగా లేదు : మమతా బెనర్జీ నిప్పులు

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (09:00 IST)
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల శవాలతో భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయాలు చేయడంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. వీర జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేయడం మీకు సిగ్గుగా లేదా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, జవాన్ల వీర మరణంతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని, తానొక్కడినే దేశభక్తుడినని, మిగతావారు దేశద్రోహులని చిత్రీకరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. 
 
జవాన్ల మృతదేహాలతో రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఉనికికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రజలకు సూచించారు. 
 
గత ఐదేళ్ళ కాలంలో మీరు (మోడీ) చేసింది ఏమీ లేదు. పైగా మన జవాన్ల వీరమరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేం మోడీ ప్రభుత్వం వెనుక లేము. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన సైనికుల వెంట ఉన్నాం అని అన్నారు. బాలాకోట్ ఉగ్రదాడుల వివరాలు బయటపెట్టమని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాపై పాకిస్థాన్ ముద్ర వేస్తున్నారని, ఆయన (మోడీ) తాను మాత్రమే భారతీయుడినని అనుకుంటున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments