Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమత బెనర్జీ మంత్రివర్గంలో.. మనోజ్ తివారీకి చోటు..!

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:19 IST)
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. ఇందులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో 24 మంది కేబినెట్‌ మంత్రులు కాగా, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మంత్రి మండలిలో సీనియర్‌ నేతలు, అనుభవజ్ఞులు, కొత్తవారికి చోటు దక్కింది.
 
సీఎం మమతా బెనర్జీతో కలిపి మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. బెంగాల్‌ రంజీ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత మనోజ్‌ తివారీ సైతం మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నాడు.
 
తివారీకి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలిసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనోజ్‌..టీఎంసీ చీఫ్‌ మమతా ఆధ్వర్యంలో పార్టీలో చేరాడు. భారత్‌ తరఫున తివారీ 12 వన్డేలు, 3 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments