Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుక్కి మరో యువతితో ఎఫైర్ వుంది, నువ్వు నాతో గడుపు: కోడలిపై మామ అత్యాచారం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (20:27 IST)
మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలోని ఇచల్‌కరంజీ అనే ప్రాంతంలో దారుణం జరిగింది. తండ్రి తర్వాత అంతటి స్థానంలో వుండి కాపాడాల్సిన మామయ్య తన కోడలిపై అత్యాచారం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... ఇచల్ కరంజీ ప్రాంతంలో 73 ఏళ్ల మహ్మద్ బాగ్వాన్ ఇంట్లో ఇటీవలే పెళ్లయిన కొడుకు-కోడలు వుంటున్నారు. ఐతే కోడలిపై మామయ్య కన్నేశాడు. కొడుకు అలా పనికి వెళ్లగానే కోడలితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టేవాడు. మామయ్య ఇలా చేస్తున్నాడని చెబితే భర్త ఏం చేస్తాడోనని విషయాన్ని బయటకు చెప్పలేదు.
 
ఇదే అలుసుగా తీసుకున్న బాగ్వాన్ కోడలిపై అత్యాచారం చేసాడు. పైగా తన కుమారుడికి వేరే యువతితో ఎఫైర్ వుందనీ, కాబట్టి నువ్వు నాతో గడుపు అంటూ ఆమెపై అత్యాచారం చేసాడు. అలా మరుసటి రోజు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనితో భర్తకు చెబితే ఏమవుతుందోనని భయపడ్డ బాధితురాలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు బాగ్వాన్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అతడిపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments