Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంతెనపై నుంచి కిందపడిన కారు - ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (10:07 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వంతెన నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృత్యువాతపడ్డారు. రోడ్డు డివైడర్‌ను డీకొట్టడంతో కారు అదుపుతప్పి వంతెన పై నుంచి కిందపడింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సావంగిలోని దత్తా మేగే వైద్య కాలేజీలో చదువుతున్న ఏడుగురు వైద్య విద్యార్థులు యావత్ మాల్ నుంచి వార్ధాకు కారులో బయలుదేరారు. గత రాత్రి అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఈ కారు ప్రమాదం జరిగింది. సెల్సురా వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అది అదుపుతప్పి వంతెన పై నుంచి కిందపడి నుజ్జునుజ్జు అయింది. 
 
దీంతో విద్యార్థులంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న లారీ ఒకటి ఈ ప్రమాద వార్తను స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా, వీరిలో ఒకరు తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజయ రహంగ్‌డేల్‌ ఏకైక కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments