Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (15:40 IST)
ఉత్తరాదిన ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడో వేవ్‌తో తప్పదని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒమిక్రాన్ కాటేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 19 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 
 
జవహర్ నవోదయ విద్యాలయ అనుబంధ పాఠశాలలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలోని రెసిడెన్షియల్ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. అందులో 19 మంది పాజిటివ్‌గా వచ్చారు. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు.
 
మరోవైపు దేశంలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, శుక్రవారం క‌రోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments