బాలుడిని మింగేసిందన్న అనుమానంతో మొసలికి చిత్రహింసలు

Webdunia
గురువారం, 14 జులై 2022 (09:10 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మొసలిని గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలుడిని మింగేసిందన్న అనుమానంతో గ్రామస్థులు ఈ పనికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ష్యోపుర్‌ జిల్లా రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్‌ సింగ్‌ సోమవారం చంబల్‌ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ వల తెచ్చి దాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. 
 
బాలుడికి ఆక్సిజన్‌ అందడం కోసమని మొసలి నోరు తెరిచి ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. చివరకు పొట్ట చీల్చి, బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పి.. మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు. బాలుడి కోసం గాలించగా.. మంగళవారం నదిలో శవమై కనిపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments