Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:24 IST)
కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధర్ గ్రామంలో పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపను పట్టించుకోకుండా ఆ తల్లి వంట పనిచేసింది. అయితే పాప ఏడుపు ఆపకపోవడంతో వంట చేస్తున్న చిరాకుతో సహనం కోల్పోయి.. కత్తితో బిడ్డ గొంతు కోసేసింది. ఆపై బిడ్డ ఏడుపు ఆపేసింది. అప్పటికే జరగాల్సిందల్లా జరిగిపోయింది. 
 
కత్తి పడటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇంటి నుంచి బంధువుల ఇంటికి పారిపోయిన సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బిడ్డను వదిలిపెట్టి తల్లి మాత్రం ఒంటరిగా పారిపోయి రావడాన్ని గమనించిన బంధువులు, స్థానికులు ఇంటిని తెరిచి చూస్తే రక్తపు మడుగులో వున్న చిన్నారిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments